బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా ..సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు . అంతేకాదు వెబ్ సిరీస్ లకు కూడా సైన్ చేస్తూ ..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్నారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మంచి రొమాంటిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . తనతో పని చేసే హీరోయిన్ల అందరిని ఓ రేంజ్ లో పొగిడేస్తూ .. ఫ్లడర్ అంటూ ఓ ట్యాగ్ వేయించుకున్నాడు.
అంతేకాదు ఈ మధ్యకాలంలో వరుణ్ దావన్ డివోర్స్ తీసుకున్న స్టార్స్ పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత బాలీవుడ్ లో ఫస్ట్ వెబ్ సిరీస్ పై సైన్ చేసింది సమంత. అందులో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు హీరో వరుణ్ ధావన్ . ఈ సిరీస్ పనుల కోసం సమంత , వరుణ్ ధావన్ ఓ రేంజ్ లో తిరిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ మాట్లాడుతూ .. “తన ఫస్ట్ టైం ఓ ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ ప్రకటనలో నటించేందుకు ఒప్పుకున్నానని ..కాగా అదే యాడ్లో సానియా మీర్జా కూడా ఉందని ..అయితే ఆ విషయం తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని.. ఎందుకంటే నాకు సానియా మీర్జా అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. దీంతో బాలీవుడ్లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఇలా మొగుళ్లను వదిలేసిన అమ్మాయిల చుట్టూ తిరగడం నీ హాబీనా..? వాళ్లపై ఎందుకు నీకు అంత మోజు ..? మంచి ఫిజిక్ హ్యాండ్సమ్ కటౌట్ ఉంది కదా నీకు..? ఇలాంటి కర్మ ఏంటి అంటూ మండిపడుతున్నారు . చూడాలి మరి వరుణ్ ఈ ట్రోలింగ్ పై ఎలా స్పందిస్తాడో..?