ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కాలంలో రీమెక్ సినిమాలకు పెద్ద చిక్కొచ్చి పడింది. అసలు భాష, నిర్మాత దగ్గర నుండి హ్కకులు తీసుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకుని, షూటింగ్ కంప్లిట్ చేసి ప్రెక్షకుల ముందు వచ్చే లోపే అ సినిమా ఒరిజినల్ వెర్షన్ థియేటర్లోనో లేదా ఓటీటీలో చూసి అ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆసలు విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం అల వైకుంఠపురములో.
పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా పెద్ద హిట్టైంది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు స్దాయిలో ‘అల వైకుంఠపురములో’ హిందీ సినిమా ఉర్రూతలూగిస్తుందా లేదో చూడాలి. ఈ రీమేక్ టైటిల్ షెహజాదా. కార్తీక్ ఆర్యన్ లుక్స్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన దక్కుతోంది.
బన్నీ స్టైల్, యాటిట్యూడ్, ఎనర్జీ ముందు ఆర్యన్ తేలిపోయాడని పైగా గుర్రంతో ఎంట్రీ ఇవ్వడాలు, క్లైమాక్స్ ని మెట్రో స్టేషన్ లో సెట్ చేయడాలు లాంటివి ఫీల్ ని తగ్గించాయని విమర్శలు వస్తున్నాయి. అసలు కథలో ఎలాంటి మార్పులు చేయకుండా యాక్షన్ ఎపిసోడ్లు మాత్రం వేరే స్టైల్లో ట్రై చేసినట్టు ఉన్నారు. నిజానికి అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ ని నార్త్ ఆడియన్స్ ఎప్పుడో చూసేశారు.
వాళ్లకు ఈ షెహజాదాలో ఎలాంటి కొత్తదనం కనిపించదు క్యాస్టింగ్ తప్ప. పైగా థమన్ ని మ్యాచ్ చేసే మ్యూజిక్ ఇందులో ఉండటం కష్టమే. ఆది పురుష్ ఫేమ్ కృతి సనన్ హీరోయిన్ గా చేసింది. కానీ పూజా హెగ్డే ఇచ్చిన క్యూట్ నెస్ తనలో కనిపించలేదు. మొత్తానికి ఈ షెహజాదాని ఖూనీ చేస్తాడా లేకా మ్యాచ్ చేస్తాడా అనేది ఇంకో మూడు నెలల్లో తేలనుంది.