టాలీవుడ్ స్టార్ స్టోరి రైటర్ వక్కంతం వంశీ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందిచాడు. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో డైరక్టర్‌గా మరాడు. తన తోలి సినిమాతో అంతగా మెప్పించలేకపోయాగడు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాకు కథ అందిస్తున్నాడు. మరో వైపు వక్కంతం వంశీ నితిన్‌తో ఓ సినిమా చేయనున్నాడు.
తాజాగా ఆలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చిన వక్కంతం వంశీ తన సినీ కెరియర్ గురించి అతని జీవితానికి సంబంధించిన విషయాలు ఆలీతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన జర్నీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయలు చేప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయలు చెప్పాడు వంశీ. మీరు చేసిన సినిమాలో ఓ సినిమాను అల్లు అర్జున్ రీమెక్ చెయాలని అనుకుంటున్నాడని ఆలీ అడగగా అ విషయనికి వంశీ నిజం అనే సమధనం ఇచ్చాడు.
నేను రాసిన కథలో బన్నీకి రెండు కథలు అంటే చాలా ఇష్టం.. కాని ఆ రెండు కథలు ప్రేక్షకులను మెప్పించలేకపోయి. ఇక అవి అల్లు అర్జున్ చేసిన సినిమాలు కాదు. వాటిల్లో ఒకటి ఊసరవెళ్లి, రెండోది కిక్ 2. ఇలాంటి అరుదైన కథలు చాలా తక్కువగా దొరుకుతాయి. వాటిని ఎలాగైనా మనం వర్క్ అవుట్ చేసుకుని తీరాలి అని అంటూ ఉంటారు. ఇక ఊసరవెల్లి సినిమా అయితే తనకి చాలా ఇష్టం. దాని పై రీ వర్క్ చేసి మళ్ళీ ఏదో ఒక రోజు సినిమా చేయాలని ఉంది అంటాడని బన్నీ చెప్పారని వంశీ తెలిపాడు.
ఊసరవెల్లి కథ నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సినిమా కథను మళ్ళీ రీ వర్క్ చేసి తమిళ్లో అయినా రీమేక్ చేస్తే ఎలా ? ఉంటుంది అని కూడా ఆలోచించేవాడు, అని అన్నారు వంశీ. మరి నిజంగానే అల్లు అర్జున్ ఊసరవెల్లి సినిమాని రీమేక్ చేస్తారా లేదా వేచి చూడాలి.