చిరంజీవితో మరో ఇడియట్..పూరి తీయబోతున్నాడా..!!

టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్‌ సినిమా పెట్టుబడుల పై విచారణ ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను రెడీ చేస్తున్నారట. పూరి తన టీమ్‌ తో మెగాస్టార్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి కూడా ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా పూరీతో సినిమా చేస్తానని మంచి లైన్ ఉంటే చెప్పమని అడిగాడు.. పూరి కూడా మీతో సినిమా చేస్తాను. నా దగ్గర మంచి లైన్ ఉందని కూడా చెప్పాడు.

చిరు, పూరీల క్రేజీ కాంబో ఎప్పుడు? | Director puri jagannadh is planning to  collaborate with megastar chiranjeevi for a project | TV9 Telugu

ఇప్పుడు పూరి- చిరంజీవి కోసం పవర్ఫుల్ భారీ యాక్షన్ కథను సిద్ధం చేశాడట. చిరంజీవి చేస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవిని మనం పాత సినిమాల్లో ఎలా ఉన్నాడు.. అలా చూడబోతున్నామ‌ని తెలుస్తుంది. పూరి ఈ సినిమా కథను తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ స్టోరీగా తయారు చేశాడట.

Actor Chiranjeevi Talks About Acharya 2 Movie Failure | மோசமான படங்கள்  தோல்வியடையும்... என் படமே சாட்சி - சிரஞ்சீவி ஓபன் டாக் | Movies News in  Tamil

ఇక ఈ సినిమాను తన డైరెక్ట్‌ చేసిన ఇడియట్ సినిమాకు కొనసాగింపుగా ఉంటుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుగుతుందట. ఈ సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉన్న.. ప్రధానంగా యాక్షన్ బేస్డ్ గానే ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో అయినా పూరి హిట్ కొడతాడో లేదో చూడాలి.