మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్ తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ నెగటివ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ క్యారెక్టర్ కి విక్కీ కౌషల్ అయితేనే సరిగ్గా న్యాయం చేస్తారని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఆ పాత్రకు విక్కీ కౌషల్ ఓకే చెప్తే మాత్రం ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయని తెలుస్తుంది.
మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమాలో నటీనటులు ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. 11 సంవత్సరాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా.. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. రీసెంట్గా మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చింది. వచ్చే నెల నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ కు పూజ హెగ్డే నటించబోతుంది. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు చూడాలి.