బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది అనసూయ, రష్మీ, సుధీర్, చమ్మక్ చంద్ర, రాకేష్, చంటి తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కొంతమంది కమెడియన్ యాంకర్ సైతం జబర్దస్త్ ఇతర చానల్స్ లో కనిపించారు. దీంతో కొత్తవారికి అవకాశాలు వెలుపడ్డాయి అలా జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక జబర్దస్త్ లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది..
ముఖ్యంగా హైపర్ ఆది అయితే చూడగానే ఈ ముద్దుగుమ్మ పైన కన్ను పడింది అనేంతలా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ లో అనసూయ మానేసిన తర్వాత ఇ కొత్త యాంకర్ ని తీసుకొచ్చారు జబర్దస్త్ యాజమాన్యం. రెండు మూడు వారాలు నుంచి సౌమ్య రావు మాత్రమే యాంకర్ గా పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉంది. జబర్దస్త్ లో ఉండే కమెడియన్లకు దీటుగా పంచులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సౌమ్యా రావు.
అయితే తాజాగా సౌమ్యా రావు జబర్దస్త్ ఆడిషన్ కోసం చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారు తోంది. జబర్దస్త్ ఆడిషన్స్ లో సామీ సామి అనే పాటకు డ్యాన్స్ వేసింది. బ్లాక్ చీర కట్టుకొని సౌమ్యరావు చేసిన ఈ వీడియో చూసిన నెట్ జనరల్ సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక మరి కొంతమంది ఏం డాన్స్ చేశావు సౌమ్య అంటూ ఫిదా అవుతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram