టాలీవుడ్ స్టార్ హీరోల‌కు `ఆదిపురుష్` భామ‌ గేలం.. గురి చూసి కొట్టిందిగా!

టాలీవుడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో సెటిల్ అయిన‌ అందాల సోయగం కృతి స‌న‌న్‌.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా `ఆదిపురుష్‌` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.

అయితే ఈ సినిమా కంటే ముందే కృతి సన‌న్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, కృతి స‌న‌న్‌ జంటగా నటించిన భేదియా చిత్రాన్ని తెలుగులో `తోడేలు` టైటిల్ తో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా నవంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంనే మేకర్స్ హైదరాబాద్లో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్లో కృతి సస‌న‌న్‌ తన మాటలతో టాలీవుడ్ స్టార్ హీరోలకు గేలం వేసే ప్రయత్నం చేసింది. తనకు తెలుగు లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప`, రాంచరణ్-ఎన్టీఆర్ కలిసిన చేసిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాలు అంటే మహా ఇష్టమని, ఈ సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయ‌ని.. అయ్యా హీరోలను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఆదిపురుష్‌ కోస్టార్ డార్లింగ్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలను ఆకట్టుకునేందుకు కృతి స‌న‌న్‌ తన మాటలతో గురు చూసి కొట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.

 

Share post:

Latest