ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా విషాద ఛాయలు వెలుబడుతూనే ఉన్నాయి.తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ బాధ నుంచి ఇంకా బయటపడక ముందే తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో నిన్నటి రోజున అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడవడం జరిగింది. దీంతో తెలుగు సిని పరిశ్రమ లో ప్రస్తుతం వరుస విషాద ఛాయలు అలముకున్నాయి.
గడిచిన కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన మదన్ హైదరాబాదులోని అపోలో ఆసుపత్రులో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉండగా నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం మదనపల్లి. సినిమాల మీద మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి “ఆ నలుగురు “సినిమా ద్వారా రచయితగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత తన ప్రతిభను నిరూపించుకోవడానికి జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్లో వచ్చిన పెళ్లయిన కొత్తలో సినిమాతో డైరెక్టర్ గా మారారు.
ఇకటి తరువాత గుండెజారి గల్లంతయింది ,ప్రవరాఖ్యుడు, గరం, గాయత్రి వంటి తదితర సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు మదన్. మదన్ చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ అవి ప్రేక్షకుల మనసుల నిలిచిపోయాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుంది. అయితే దర్శకుడుల రచయితగా మంచి పేరు సంపాదించిన మదన్ ఇలా ఆకస్మిక మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా శాఖ గురి చేసింది. దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈయన మరణానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు.