జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్‌ తెచ్చుకుంటుందో అన్న‌ విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Balakrishna and Chiranjeevi playing the waiting game - TeluguBulletin.com

ఇక బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి పై కూడా టాలీవుడ్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా ఈ స్టార్ హీరోల అభిమానులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పక్క మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఏమాత్రం తక్కువ కాకుండా ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాలో 11 కు పైగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య లో కూడా భారీగానే యాక్షన్ సన్నివేశాలను పొందుపరిచారట. వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి అలాగే వీర సింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఎప్పటినుంచో మంచి స్నేహితులు. ఈ ఇద్దరి స్నేహితుల మధ్య మొదటిసారి బాక్సాఫీస్ వద్ద పొట్టి నెలకొంది. ఇద్దరు హీరోలు- దర్శకుల మధ్య పోటీ మాత్రమే కాకుండా ఇప్పుడు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ గా ఉన్న దేవీశ్రీప్ర‌పాద్- థ‌మ‌న్ మ‌ధ్య కూడా ఒక తెలియ‌ని పోట్టి నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు.

వీరిద్దరూ ఇప్పటికే అగ్ర దర్శకులను ఆకర్షించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒక విధంగా గ‌త‌ కొంతకాలంగా థ‌మ‌న్‌నే టాలీవుడ్ లోనే అగ్ర మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. సంక్రాంతికి రాబోయే బాలయ్య సినిమాతో మరింత డామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ముందుగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన వాల్తేరు వీరయ్య సినిమా నుండి బాస్ పార్టీ అనే సాంగ్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Boss Party vs Jai Balayya Competition DSP vs Thaman

ఈ సాంగ్ తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి సినిమా నుండి థ‌మన్ మ్యూజిక్ అందించిన జై బాలయ్య అనే మరో సరికొత్త సాంగ్ రాబోతుంది. ఇప్పటికే థ‌మన్ అఖండ‌ సినిమాలో ఇచ్చిన‌ జై బాలయ్య పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు థ‌మన్ వీరసింహారెడ్డి నుండి వచ్చే జై బాలయ్య పాటతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఇప్పుడు ఈ రెండు పాటల్లో ఏ పాట ఎక్కువ స్థాయిలో యువతను ఎట్రాక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి అగ్ర మ్యూజిక్ డైరెక్టర్లకి ఇది అసలైన పోటీ అని చెప్పవచ్చు.. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Share post:

Latest