తెలుగు సినీ చరిత్రలో కల్టు క్లాసికల్ చిత్రంగా నిలిచిపోయిన చిత్రం శంకరాభరణం. కళాతపస్వి కే. విశ్వనాధ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఈ చిత్రం 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. శంకరాభరణం చిత్రానికి మరొక అరుదైన గౌరవం తాజాగా లభించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలనచిత్ర IFFI 2022 లో రిస్టోర్ ఇండియన్ క్లాసికల్ విభాగంలో ఈ చిత్రం ఎంపికైనట్లుగా తెలుస్తోంది.
నేషనల్ ఫిలిం ఆర్త్కైవ్ ఆఫ్ ఇండియా మనదేశంలో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించిన గొప్ప చిత్రాలని డిజిటలైజేషన్ చేసి చాలా భద్రపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగులో విశేషా ఆదరణ పొందిన ఈ శంకరాభరణం చిత్రానికి కూడా అక్కడ చోటు కల్పించారు. ముఖ్యంగా శంకరాభరణం సినిమాలు జెవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. 1980 ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా విడుదలై తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
మలయాళం లో ఈ సినిమా దాదాపుగా ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది. బెంగళూరులో తెలుగు వర్షన్ లో కేకంగా ఒక సంవత్సరం పాటు ఈ సినిమా ఆడడం గమనార్హం. శాస్త్రీయ సంగీతం ప్రాముఖ్యత తెలియజేసిన ఈ సినిమా తెలుగు సినిమా క్యాతిని ఒక్కసారిగా ప్రపంచ స్థాయికి పెంచేలా చేసింది. ముఖ్యంగా రెగ్యులర్ థియేటర్లలో కూడా యూఎస్ఏ లో విడుదలైన మొట్టమొదటి చిత్రంగా ఈ శంకరాభరణం చిత్రం నిలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఉత్తమ జనరంజక చిత్రంతో సహా నాలుగు జాతీయ అవార్డులను కూడా అందుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏడు నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఇప్పుడు IFFI లో ఏడాది భాగంగా స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నారు.