ఏపీలో సినిమా రాజ‌కీయం… దీనికి అంత సీన్ ఉందా…!

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నేరెండంటా..! అన్న‌ట్టుగా సాగుతున్న ఏపీ రాజ‌కీయాలు మ‌రింత యూట‌ర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మ‌రింతగా రాజ‌కీ యాలు వాడివేడిగా సాగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా సంచల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సీఎం జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం.. ఆ త‌ర్వాత తాను సినిమా తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

Andhra Pradesh: Film Director Ram Gopal Varma meets CM YS Jagan

అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్న‌ట్టు వ‌ర్మ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు, రాజ‌కీయ అరాచకానికి ఈ సినిమాలు సూప‌ర్‌గా ఉంటాయ‌ని కూడా హింటిచ్చాడు. ఇక‌, దీనిపై వెంట‌నే రియాక్ట్ అయిన జన‌సేన‌..తాము కూడా సినిమాలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. అది కూడా రాజ‌కీయంగానే ఉంటుందని, వైసీపీ అరాచ‌కాల‌పైనే ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. మొత్తానికి ఈ ప‌రిణామం.. రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి.

CM Jagan Refusing Appointment for Balakrishna

అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే ఈ సినిమాల‌తో ఈ రెండు పార్టీల‌కు ఒరిగేది ఏంటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. సినిమాలు నిజంగానే ప్ర‌భావితం చూపుతాయా? అంటే.. చెప్ప‌లేం.
ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బాల‌కృష్ణ‌.. అన్న‌గారు ఎన్టీఆర్ స్పూర్తిని ర‌గిలించి చంద్ర‌బాబు అధికారాన్ని మ‌రోసారి నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సినిమా తీశారు. స్వ‌యంగా త‌నే న‌టించారు.

NTR biopic renamed 'Kathanayakudu', 1st part out on January 9, 2019 - The Statesman

అయితే.. ఈ సినిమా ఫ‌ట్ అయ్యింది. ఆశించిన విధంగా చంద్ర‌బాబు అయితే మ‌ళ్లీ అధికారంలోకి రాలేక పోయారు. దీంతో ఆ సినిమా వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. సో.. ఇప్పుడు కూడా అంతే జ‌రుగుతుందనేది మేధావుల మాట‌. ఎందుకంటే.. రెండు గంట‌ల సినిమా చూసి ప్ర‌జ‌లు భావోద్వేగానికి గురైనా అది ఎంతోసేపు ఉండ‌ద‌ని.. సినిమా హాల్ గేటు దాట‌గానే మ‌రిచిపోతార‌ని చెబుతున్నారు. సో.. స‌చిత్రాలు ఎవ‌రు తీసినా.. వాటి వ‌ల్ల ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏ పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌వ‌ని చెబుతున్నారు.