అవును! ఇప్పుడు ఈ మాటే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ సర్.. ఇదే మంచి టైం! తక్షణ నిర్ణయం తీసుకోండి! అని నెటిజన్లు ఆయనకు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బీజేపీపై ఏపీ ప్రజల్లో నమ్మకం లేదు. అంతకుమించి అసలు సానుభూతి కూడా లేదు. ఎప్పటికప్పుడు బీజేపీ గ్రాఫ్.. నోటా కన్నా దారుణంగా కనిపిస్తోంది. ఇటీవల మోడీ పర్యటనకు వచ్చి..కనీసం ఏపీ సంగతులను సైతం ప్రస్తావించలేదు.
ఏపీకి ఇస్తామన్న హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రస్తావించకుండా వెళ్లి పోయారు. దరిమిలా.. బీజేపీ గ్రాఫ్ మరింత డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తులో కొనసాగడం వల్ల జనసేన మరింత డ్యామేజీని సొంతం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో జనసేనకు మరింత డ్యామేజీ ఖాయమని కూడా నెటిజన్లు చెబుతు న్నారు.
ఇప్పటికిప్పుడు వ్యూహాన్ని మార్చుకుని.. ముందుకు సాగితే..వచ్చే ఏడాది సమయంలో ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా జనసేనపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. పైగా.. ఇప్పుడు మంచి దూకుడుపై ఉన్న టీడీపీతో చేతులు కలపడం ద్వారా పోయేది ఏమీలేదు. వచ్చే ఎన్నికల్లో వస్తే గిస్తే.. అధికారం తప్ప!! అంతేకాదు, బీజేపీనిసైతం డిఫెన్స్‌లో పడేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ విషయంలో లేటు చేసి ఎన్నికల వరకు సాగదీత వైఖరి అవలంబిస్తే.. అప్పటికప్పుడు నమ్మేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయమే పెద్ద ఉదాహరణ. సో.. దీనిని గుర్తించి పవన్ అడుగులు వేయాలని అంటున్నారు పరిశీలకులు. ఆయన తీసుకునే తక్షణ నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం చేస్తారోచూడాలి.