టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చే ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో రాశి కూడా ఒకరు. హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు తేజ డైరెక్షన్లో వచ్చిన నిజం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా.. గోపీచంద్, రాశి విలన్ గా నటించి భయపెట్టిన తీరుకి అప్పట్లో అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత అన్ని రకాల రోల్స్ పోషించిన ఈమె గోకులంలో సీత , శుభాకాంక్షలు వంటి చిత్రాలతో హోమ్లీ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది.
తర్వాత పెళ్లి పందిరి, ప్రేయసి రావే, సందడే సందడి వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన ఈమె ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని పొందలేకపోయింది. కెరియర్ డెవలప్ అవుతున్న సమయంలోనే శ్రీనివాస్ అనే అసోసియేట్ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకొని వెండితెరకు దూరం అయింది. చెన్నైలో సెటిల్ అయిన రాశికి 2014లో ఒక పాప జన్మించింది. పెళ్లి తర్వాత పరిస్థితి అంతా సెట్ అవుతుందని అనుకుంది. కానీ భర్త శ్రీనివాస్ ని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి తాను నిర్మాతగా మారడం, ఆర్థికంగా కృంగిపోవడంతో.. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.
అది కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో.. అనుకోకుండా పవన్ కళ్యాణ్ ను కలసిన రాశికి మణికొండలో ఒక ప్లే స్కూల్ నడపమని సలహా ఇచ్చారట. ఇక అయినా కూడా రాశికి కలిసి రాలేదు. ఆమె స్కూల్లో చేరిన శివ బాలాజీ కొడుకు ఒకరోజు ఒంటిపై గాయాలతో ఇంటికి రావడంతో శీను కాస్త రివర్స్ అయ్యింది. అంతేకాదు స్కూల్ నడపడం చేతకాకపోతే .. మూసేసుకోండి అంటూ రాశీ పై శివ బాలాజీ దంపతులు ఫైర్ అయ్యారు. ఇంకేముంది కొంతమంది పిల్లలు మానేయడంతో రాశి పరిస్థితి మరింత దిగజారిపోయింది.. అప్పటికే బరువెక్కిన ఈమె లావు తగ్గే టెక్నిక్స్ ఫాలో అయ్యి సన్నజాజితీగల మారిపోయింది. అయినా కూడా అవకాశాలైతే రావడం లేదు..