సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పిన వరలక్ష్మి.. స్టన్ అయిన బాలయ్య..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అనగానే గుర్తుకు వచ్చేది భారీ డైలాగ్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అలాంటి బాలయ్యకే ఒక నటి డైలాగ్స్‌తో షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళనటి అయినా తెలుగులో చాలా అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అలరించిన వరలక్ష్మికి, బాలయ్య హీరోగా నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

‘వీర సింహారెడ్డి’ సినిమాలో వరలక్ష్మీ పాత్రకు సంబంధించిన సమాచారం ప్రకారం ఆమె ఆ పాత్రలో ఇరగదీసిందని అంటున్నారు. తాజాగా వరలక్ష్మి వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది. ఆమె 5 పేజీల డైలాగ్ ని సింగల్ టేక్ లో చెప్పడంతో సెట్ లో ఉన్న వారంతా షాక్ అయ్యారని ఆమె చెప్పింది. అక్కడే బాలకృష్ణ కూడా ఉండటం విశేషం.

‘బాలకృష్ణ గారు వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలోనే నాకు ఐదు పేజీల డైలాగ్ ఇచ్చారు డైరెక్టర్. ఆ సీన్ కోసం మూడు రోజుల ప్లాన్ చేశాను. ఆ డైలాగుని ముక్కలు ముక్కలుగా కట్ చేసి సీన్‌ చేద్దామనుకున్నారు. కానీ నేను ఆ ఐదు పేజీల డైలాగుని సింగిల్ టేక్‌లో చెప్పేసాను. దాంతో బాలయ్యతో సహా ఆ సెట్లో ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇది నా కెరీర్‌లోనే మెమొరబుల్ మూమెంట్.’ అంటూ వరలక్ష్మి వివరించింది. మనమందరం కూడా ఆ డైలాగు ఏంటో తెలుసుకోవాలంటే వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయకు తప్పదు.