కోలీవుడ్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీని ఉందని చెప్పవచ్చు. తమిళ స్టార్ హీరోలలో విజయ్ కూడా ఒక్కరు. ఇక విజయ్ తండ్రి ఒక ప్రముఖ దర్శకుడు..అంతేకాకుండా విజయ్ చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో పలు సినిమాలలో నటించాడు. మొదటగా విజయ్ ‘నాలయై తీర్పు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో తనకున్న క్రేజ్ తో నెమ్మదిగా కోలీవుడ్ లో స్టార్ గా స్థిరపడిపోయాడు. ఇక విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్ కి 1999లో సంగీత అనే అమ్మాయితో వివాహం జరిగింది.ఇంతకీ ఈ సంగీత ఎవరో కాదండి విజయ్ కి పెద్ద అభిమాని. విజయ్ తన అభిమానినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి పరిచయం పెళ్లిగా ఎలా మారిందనే విషయం అప్పట్లో చాలా వైరల్ గా మారింది.. సంగీత లండన్ లో స్థిరపడ్డ తమిళమ్మాయి. అయితే సంగీత ,విజయ్ సినిమాలను చూసి తన వీరాభిమానిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే విజయ్ ని చూడటానికి 1996లో లండన్ నుంచి చెన్నైకి వచ్చింది. ఇక తెలిసిన వారి ద్వారా విజయ్ ని కలిసింది. అంతే తొలిచూపులోనే విజయ్ సంగీత తో ప్రేమలో పడ్డాడు.
అయితే ఆమెను భోజనానికి కూడా తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ తరువాత తన ఫోన్ నెంబర్ ని కూడా ఇప్పించుకున్నాడట విజయ్ . ఇక అప్పటినుంచి ఇద్దరు మాట్లాడుకొని కలుసుకునే వారట. దాంతో వీరిద్దరి అభిప్రాయాలు కూడా కలిసాయి. విజయ్ ఆహ్వానం మేరకు కొద్దిరోజుల తర్వాత సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. విజయ్ ఇంటికి వెళ్లిన సంగీత తన ప్రవర్తనతో విజయ్ కుటుంబ సభ్యులను ఆకట్టుకుంది. దాంతో విజయ్ తండ్రి ఇలా అన్నారట. నా కొడుకును పెళ్లి చేసుకుంటావా.. అంటు మొహమాటం లేకుండా అడిగేసార. ఆ మాటలకి సంగీత కూడా ఓకే చెప్పిందట.ఆ వెంటనే ఆగస్టు 25, 1999లో వీరిద్దరికీ పెద్దల సన్నిధిలో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు జన్మించారు ప్రస్తుతం విజయ్ తమిళ్ తెలుగులో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.