కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా జెరేమియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ గానే కాకుండాా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కొలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోలతో కూడా నటించింది. కాగా ఆండ్రియా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటలన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.
“నేను గతంలో ఒకరితో డేటింగ్ చేశాను కానీ, అతను మాత్రం నన్ను చాలా దారుణంగా మోసం చేశాడు. నాకు 20 సంవత్సరాల వయసులోనే నాకు ఈ సంఘటన ఎదురైందని ఆండ్రియా తన వ్యక్తిగత జీవితం లో జరిగిన ఈ కీలక సంఘటనకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చింది”. “ఇక అలాగే ఆండ్రియా ఇంకా మాట్లాడుతూ.. ఆ తర్వాత నుంచి నేను ఎవరిని ప్రేమించలేదు.. నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు. నేను నా లైఫ్ లో ఎంతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే నా దృష్టిలో పెళ్లైన ఆడవాళ్లెవరూ ఆనందంగా లేరని ఆండ్రియా చెప్పుకొచ్చింది”.
ప్రస్తుతం ఈ సీనియర్ ముద్దుగుమ్మ కోలీవుడ్లో పిశాచి 2 అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ షాకింగ్ నిర్ణయం తీసుకుందట.ఈ సినిమాలో ఆండ్రియా కొన్ని సన్నివేశాలలో నగ్నంగా నటించిందని తెలుస్తుంది. కథలో భాగంగా వచ్చే ఈ సన్నివేశాలలో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా నటించాల్సిన అవసరం రావడంతో ఆమె నో చెప్పకుండా కథ కోసం ఆండ్రియా నగ్నంగా నటించిందట.