నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ ఇచ్చిన థమన్ ఈ సినిమా కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన జై బాలయ్య అనే ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో రామోజీ ఫిలిమ్ సిటీ లో జరుగుతుంది. అక్కడ ఈ సినిమా క్లైమాక్స్ కు సంబంధించిన ఫైట్ షూటింగ్ జరుగుతుంది.
డిసెంబర్ రెండో వారం కల్లా ఈ సినిమా షూటింగ్ ముగించాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇక ఆ ఫోటోలో బాలకృష్ణ ముఖంపై గాయాలతో వైట్ అండ్ వైట్ డ్రస్సులో ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఆ ఫోటోలో బాలకృష్ణతో మరో వ్యక్తి పూజారి గెటప్ లో ఉన్నాడు. అతను బాలకృష్ణతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇక దీంతో పూజారి గెటప్ లో ఉన్న వ్యక్తి ఎవరు అంటూ బాలయ్య అభిమానులు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి పేరు ఎస్ ఆర్ ప్రసాద్.. అతను బాలకృష్ణ వీరాభిమాని… పొద్దుటూరు కి చెందిన రిటైర్ ఆర్ టి సి కండక్టర్. ఆయన వీర సింహారెడ్డి లో బాలయ్యతో కలిసి నటించాడు. అతని గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— S.M.SHAREER (@mahaboob75) November 28, 2022