టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక ప్రభాస్ ఎప్పటికే బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్. ప్రాజెక్ట్ కే సినిమాలో బిజీగా ఉండగా. మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుని. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూడా తాను చేసే తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా ఇమేజ్ కు తగకుండా చూసుకుంటున్నాడు. ఆయన చేసే సినిమాల డైరెక్టర్ లని కూడా తన ఇమేజ్‌కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నాడు.
పుష్ప 2 సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీ కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను 2024 జనవరిలో మొదలుపెట్టి అదే సంవత్సరం దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇదే దర్శకుడు తో పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి హీరోలలో ఏ హీరోతో ఈ దర్శకుడు సినిమా చేస్తాడో.. ఎవరికి బొక్క పడుతుందో కాలమే నిర్ణయించాలి.