షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకొన్న ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన డాన్స్ వీడియోలు అలాగే వెబ్ సిరీస్ లతో మంచి ఫేమ్ సంపాదించుకున్న షణ్ము.. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు.
తనదైన రీతిలో ఆట ఆడి రన్నరప్ గా నిలిచి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన షణ్ను.. ఇటీవల తిరిగి మళ్లీ యాక్టివ్ గా స్పందిస్తున్నాడు. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ `ఏజెంట్ ఆనంద్ సంతోష్` అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక అసలు విషయానికొస్తే.. షణ్ను యూట్యూబ్ లో పాపులారిటీ సాధించడానికి ముందే అతనికి భారీగానే ఆస్తులు ఉన్నాయట. ఆ తర్వాత యూట్యూబ్ సంపాదన రావడంతో అతని ఆస్తులు విలువ ఇక మరింత పెరిగినట్లు సమాచారం. అయితే దాదాపు షణ్ముఖ్ జస్వంత్ 12 కోట్లు విలువ చేసే ఆస్తులకు వారసుడట. అతడి తండ్రి కి కూడా సొంతంగా కొన్ని బిజినెస్ లు కూడా ఉన్నాయని సమాచారం. అయితే షణ్ముఖ జశ్వంత్ నెలకు వెబ్ సిరీస్ ల ద్వారా 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.