టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ రేస్ నుంచి ఇంటికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు ఓటములు తరువాత.. పాక్ సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన పాకిస్తాన్- జింబాబ్వే మ్యాచ్‌లో ఎవరు ఊహించిన విధంగా జింబాబ్వే- పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఇక దీంతో గ్రూప్. బి లో ఉన్న జట్లలో సెమీఫైనల్ ఫైట్ చాలా ఆసక్తికరంగా మారింది.
ఇండియా- జింబాబ్వేలతో ఓటమి పాలైన పాకిస్తాన్.. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాయింట్ల పట్టికలలో 0 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన టీమ్‌లు భారత్- దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ -జింబాబ్వేలు పాకిస్తాన్ కంటే ముందు వరుసలో ఉన్నాయి. ఇక టీమిండియా రెండు మ్యాచ్ గెలవడంతో నాలుగు పాయింట్లతో ఉండగా.. జింబాబ్వే- దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి మూడు పాయింట్లు సంపాదించుకున్నాయి. బంగ్లాదేశ్ రెండు పాయింట్లుతో మూడో స్థానంలో నిలిచింది.
పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరుకోవాలంటే గ్రూప్ బి లో ఉన్న మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంది. ఇక పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోను పాకిస్తాన్ కచ్చితంగా భారీ స్కోరుతో విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ భారీ స్కోర్‌తో విజయం సాధించకపోతే నెట్ రేట్ పెరగకపోవడంతో పాకిస్తాన్ ఇంటికి వెళ్లి పోయే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.