తెలుగులో సత్తాచాటిన కన్నడ సినిమాలు ఇవే!

గతకొంతకాలంగా కన్నడ సినిమాలు యావత్ ఇండియాలో సత్తా చాటుతున్నాయి. బేసిగ్గా సినిమా నచ్చితే మనవాళ్ళు అది ఏ భాష సినిమా అని చూడరు. కంటెంట్ నచ్చింటే మన తెలుగు ప్రజలు బ్రహ్మరధం పడతారు. అది నాటినుండి జరుగుతూ వస్తోంది. నిన్నమొన్నటివరకు తమిళ సినిమాలు ఇక్కడ సత్తా చేటేవి. కాగా ఇపుడు తెలుగు, కన్నడ సినిమాలు మాత్రం ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నాయి. KGF రాకతో తెలుగులో కన్నడ డబ్బింగ్ చిత్రాలకు మళ్లీ గిరాకీ మొదలైంది. అలాగే తాజాగా కాంతారా మూవీ సక్సెస్‌తో అది మరోసారి ప్రూవ్ అయింది.

కాగా కాంతారా సినిమా తెలుగులో దాదాపు 30 కోట్ల వరకు రాబట్టినట్టు భోగట్టా. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల విషయానికొస్తే. మొదటగా KGF Chapter 2 ని చెప్పుకోవచ్చు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తరువాత రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతారా’ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కన్నడలో కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.

అలాగే సుదీప్ హీరోగా నటించిన మూవీ ‘విక్రాంత్ రోణ’ కూడా ఇక్కడ బాగా ఆడింది. తెలుగులో ఈ చిత్రం రూ. 4.07 కోట్ల షేర్ రాబట్టి కన్నడ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ 4లో నిలిచింది. అలాగే ధృవ సర్జ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన సినిమా ‘పొగరు’ సినిమాకూడా ఇక్కడ బాగా ఆడింది. ఇక సుదీప్ హీరోగా గత సంవత్సరం వచ్చిన చిత్రం ‘పహిల్వాన్’ చిత్రం తెలుగులో రూ. 1.45 కోట్ల షేర్ రాబట్టి కన్నడ టాప్ డబ్బింగ్ చిత్రాల్లో 7వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత రక్షిత్ శెట్టి హీరోగా నటించిన మూవీ తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ గా డబ్ చేసి విడుదల చేయగా తెలుగులో రూ. 1.21 కోట్ల షేర్ రాబట్టింది.