మొన్న కే.జి.ఎఫ్.. నిన్న కాంతారా..ఇప్పుడు కేడి.. అదరగొడుతున్న టీజర్..!!

ఈ మధ్యకాలంలో కన్నడ సిని పరిశ్రమ నుంచి విడుదలైన ఎన్నో చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటుతూ ఉన్నాయి. అలా ఇప్పటివరకు కేజిఎఫ్ సినిమాతో మొదలుపెడితే.. కేజిఎఫ్ -2, చార్లీ-777, విక్రాంత్ రోణా, కాంతారా చిత్రాలు అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా భారీగానే రాబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా శాండిల్ వుడ్ నుంచి వచ్చే సినిమాల పైన మరింత ఫోకస్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల కాబోతున్న “కేడీ ” సినిమా కూడా ఈ నేపథ్యంలోనే మంచి హైప్ ని ఏర్పరచుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

Prem-Dhruva Sarja's film titled 'KD' | Kannada Movie News - Times of India

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శాండిల్ వుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందిన ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లేవల్ లోనే విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్ గ్రాండ్గా ఈ సినిమా టైటిల్ టీజర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ టైటిల్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లాంచ్ చేసి చిత్ర బృందం నికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. రామాయణ యుద్ధం స్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసమే అంటూ ఒక మాస్ డైలాగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కూడా చాలా సస్పెన్సివ్ గా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ధ్రువ సర్జ నటన కూడా అద్భుతంగా ఉండేలా ఒక మాస్ అవతారంలో కనిపిస్తోంది. దాదాపుగా కేజిఎఫ్ సినిమా తరహాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రం 1970 లో బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యాక్షన్ త్రిల్లర్ చిత్రం అన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ మాత్రం వైరల్ గా మారుతోంది.