సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు పొందింది శ్రీదేవి. ఎక్కువగా సినీ విషయంలో తప్ప ఈమె పర్సనల్ జీవితం గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ముఖ్యంగా శ్రీదేవికి ఒక చెల్లెలు ఉందని ఆమె పేరు శ్రీలత అని ఎవరికీ తెలియదు. వాస్తవానికి శ్రీలత అంటే శ్రీదేవికి చాలా ప్రేమాభిమానాలు ఉండేవట. వీరిద్దరి మధ్య ఉన్న మెమోరీస్ శ్రీదేవి పలు సందర్భాలలో తెలియజేస్తూ ఉండేది. శ్రీదేవి సినిమాలలో వేసుకున్న డ్రస్సులు శ్రీలతకి కావాలని మారం చేస్తూ ఉండడంతో ఎన్నోసార్లు అలాంటివి ఇచ్చేదట. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో మనం ఊహించుకోవచ్చు.
అలాగే శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక రాత్రి ఏ సమయానికి వచ్చిన సరే తన చెల్లి తో మాట్లాడకుండా నిద్రపోయేది కాదట. ఇద్దరు కూడా కలిసి సినిమాలు చూసేవారట శ్రీలతకు నవలలు అంటే చాలా ఇష్టమట. అలా చదివిన కథలను తన అక్కతో ఎక్కువగా చర్చించుకునేదట శ్రీలత. కానీ శ్రీదేవితో మాత్రం శ్రీలత ఎప్పుడూ కూడా షూటింగ్ కి వెళ్ళేది కాదట. అయితే వీరిద్దరూ కలిసి చిన్నతనంలో అక్కాచెల్లెళ్ళుగా ఒక సినిమాలో నటించారని సమాచారం.
శ్రీలత ఎంత మొండిగా ఉంటుందో అంతే మంచితనంగా ఉంటుందట. శ్రీదేవి, శ్రీలతకు చీరలు అంటే చాలా ఇష్టమట.వీరిద్దరూ కూడ ఎప్పుడూ కూడా ఒకే రంగు చీరలోనే కనిపిస్తూ ఉంటారు. శ్రీదేవి ఎక్కడైనా విదేశాలకు షూటింగ్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కచ్చితంగా తన చెల్లికి ఏదో ఒక వస్తువు తెస్తూ ఉండేదట.అలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఆ తర్వాత శ్రీలత సంజయ్ రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో అప్పటినుంచి శ్రీదేవి, శ్రీలత మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ కొంతకాలం కూడా మాట్లాడుకోలేదని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బోణి కపూర్ సహాయంతో తిరిగి శ్రీదేవి శ్రీలత ఒక్కటయ్యారని సమాచారం.