సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం. తాగి బండితో రోడ్డు మీదకి వస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడ లేదు. వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అలాంటి తప్పే చేస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కిన వారిపై పోలీస్ శాఖ ఒకే రీతిలో కేసు ఫైల్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. అలా పీకల వరకు తాగి పోలీసులకు చిక్కిన ఆ స్టార్ సెలబ్రిటీల గురించి ఒకసారి తెలుసుకుందాం.
నిఖిల్ సిద్ధార్థ్: తాజాగా వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే నిఖిల్ నటించిన `కార్తికేయ 2` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి విదేశాలలో సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నిఖిల్ కూడా 2011లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద పోలీసులకి పట్టుబడ్డాడు. ఇక అప్పుడు పోలీసులు నిఖిల్ ని తన కార్ని రాత్రంతా స్టేషన్లో ఉంచి మరుసటి ఉదయాన్నే పంపడం జరిగింది.
నవదీప్: తొలి సినిమా జై తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవదీప్. అలా పలు సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆ తర్వాతి కాలంలో సెకండ్ క్యారెక్టర్ లోని నటిస్తూ ఉన్నాడు. అయితే గతంలో నవదీప్ పీకల వరకు తాగడమే కాకుండా పోలీసులు కార్ ఆపమని చెప్పినా సరే ఆపకుండా వారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. అయితే పోలీసులు చేజింగ్ చేయగా వారికి దొరకడం జరిగింది. అప్పట్లో నవదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కడంతో ఆ వార్త చాలా సెన్సేషనల్ గా మారింది.
శివ బాలాజీ: `చందమామ` సినిమాలో సెకండ్ హీరోగా నటించిన శివ బాలాజీ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే శివ బాలాజీ కూడా 2014లో భారతి భవన్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టు పడ్డాడు. ఇక ఆ తరుణంలో సహనం కోల్పోయిన శివ బాలాజీ మీడియా వారి మీద మండిపడటంతో పాటు వారిపై దుర్భాషలాడే ప్రయత్నం చేశాడు. ఇక వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు చిక్కడం జరిగింది. వారిలో సాయి రోహిత్, రవితేజ తమ్ముడు భరత్, సినిమా నిర్మాత అయిన వెంకట్, బిబిఎస్ రవి, రాజా రవీంద్ర, యాంకర్ ప్రదీప్, షణ్ముఖ్ జశ్వంత్ లాంటి సెలబ్రిటీలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టు పడడం జరిగింది.