పెళ్లికి ముందే సిద్ధుతో సమంత.. ఆ తప్పు కూడా చేసేసిందా..? ఇదేం ట్విస్ట్ రా బాబోయ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సమంత త్వరలోనే జనాల ముందుకు రాబోతుందట. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె తన విడాకులకు గల కారణాలను కూడా ఓపెన్ గా చెప్పడానికి సిద్ధపడిందట . మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ను ఒప్పించి గ్రాండ్గా గోవాలో పెళ్లి చేసుకున్నారు.

అయితే కొన్ని అనుకోని మనస్పర్ధలు కారణంగా వీళ్ళు విడాకులు తీసుకున్నారు . విడాకులు తీసుకొని కూడా దాదాపు సంవత్సరం కంప్లీట్ అయింది . ఇప్పటికీ ఈ జంట తాము విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. అయితే విడాకుల తర్వాత సమంతను సోషల్ మీడియా వేదికగా జనాలు హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. మరీ ముఖ్యంగా పెళ్లికి ముందే సమంత హీరో సిద్ధార్థ మ్యాటర్ ఫినిష్ చేసిందని.. సమంత క్యారెక్టర్ చీప్ అని అక్కినేని అభిమానులు ఆమెపై మండిపడ్డారు.

Heartbroken Samantha Akkineni once opened up about ex-boyfriend; also about  her personal life

ఈ క్రమంలోనే సమంత-సిద్ధార్థ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే సమంత సిద్ధార్థతో కలిసి సినిమాలో నటించింది . ఆ టైంలో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యారు . అప్పట్లో ఏ ఫంక్షన్ కి వెళ్లాలన్నా సరే సమంత సిద్దు మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకొని.. చేతిలో చేయి వేసుకొని ..హాట్ కపుల్ గా వెళ్లేవాళ్ళు. వీళ్ళని చూసిన అందరూ కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ కామెంట్స్ చేశారు.

Siddharth, Samantha visit Srikalahasti temple | Telugu Movie News - Times  of India

అంతేనా వీళ్ళ ప్రేమ మేటర్ ఇంట్లో చెప్పి పెళ్లికి కూడా సిద్ధపడ్డారట . అయితే సిద్ధార్థ తరఫున ఉండే పూజారి సమంత జాతకంలో దోషం ఉందని.. ఆమె వివాహ బంధం నిలుపుకోలేదని ..ఇద్దరు కలిసి ఉండాలంటే కచ్చితంగా దోష పరిహార్ పూజ చేయాలని చెప్పారట . ఈ క్రమంలోనే పెళ్లికి ముందే ఇంట్లో దంపతులుగా కలిసి కూర్చొని హోమం కూడా వేశారట. ఎన్ని హోమాలు వేసిన ఏం ప్రయోజనం మనుషుల్లో నిజాయితీ లేకపోతే ..నిజమైన ప్రేమ కనిపించకపోతే ..ఏ రిలేషన్ షి కూడా నిలబడదు . అలాగే సమంత-సిద్దు బంధం కూడా ఫ్లాప్ అయింది. మధ్యలోనే తెగిపోయింది.