ఘోస్ట్ సినిమా ప్లాఫ్ అవ్వడానికి… నాగార్జుననే కారణమా..?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ది ఘోస్ట్ ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాగార్జునకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

The Ghost Movie Review: Nagarjuna and Sonal Chauhan shine in this half-baked film

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అందరూ షాక్ అవుతున్నారు. నాగార్జున ఈ సినిమాకు ముందు బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని భారీ కలెక్షన్లను రాబట్టారు. అయితే ఇప్పుడు వచ్చిన ఘోస్ట్ సినిమా మాత్రం నాగార్జునకు భారీ స్థాయిలో నిరాశని మిగిల్చింది. ఘోస్ట్ సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్ని ఏరియాలో రైట్స్ తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఏరియాలో కూడా ఈ సినిమా ఆశించిన కలెక్షన్లను రాబట్టుకోలేక పోతుంది.

Nagarjuna's 'The Ghost' schedule gets a new update - Telugu News - IndiaGlitz.com

ఇక ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బానే జరిగింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని సినీ విశ్లేషకులు అంటున్నారు. సినిమా స్టోరీ బాగున్న ఆడియన్స్ కి రీచ్ చేయలేగా ప్రమోషన్స్ చేయలేదని దీని కారణంగానే ఈ సినిమా కలెక్షన్లు రాలేదని నాగార్జునకు తెలిసిందట. నాగార్జున తన తర్వాత సినిమాల ప్రమోషన్ల విషయంలో భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.