నానీని ఘోరంగా అవమానించిన మంచు విష్ణు.. చివ‌ర‌కు న‌వ్వుల పాలు!?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బడా బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలే సక్సెస్ కాలేకపోతుంటే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు నాని. మొదట్లో రాఘవేంద్రరావు, బాపు లాంటి లెజెండ్స్ దగ్గర నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి `అష్టా చమ్మా` సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నానికి అవకాశాలు క్యూ కట్టాయి.

nani
nani

అయితే కెరీర్ ప్రారంభంలో నాని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. అయితే ఒకప్పుడు నాని సినిమా రిలీజ్ అవుతున్న టైం లో ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కొడుకు సినిమా కూడా విడుదలవుతుందట. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండడంతో థియేటర్స్ లో కొంచెం సమస్య వచ్చిందంట. అప్పుడు నేరుగా ఆ స్టార్ హీరో కొడుకు రంగంలోకి దిగి డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి తన సినిమానే ముందు రిలీజ్ చేయ‌మ‌ని ఇలా అన్నాడట.. నా సినిమా ముందు ఆ పొట్టోడి సినిమా ఎంత నా సినిమాతో వాడికి సినిమాకు పోటీ ఏంటి.. మా నాన్న ఎవరో తెలుసు కదా.. జాగ్రత్త అంటూ బెదిరింపులు చేసి నాని సినిమాకు థియేటర్స్ దక్కనివ్వకుండా మొదట తన సినిమానే రిలీజ్ చేయించుకున్నాడట.

క‌ట్ చేస్తే .. చివరికి నాని సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ స్టార్ హీరో కొడుకు సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు మంచు విష్ణు. నానీని పొట్టోడు అని ఘోరంగా అవమానించిన మంచు విష్ణునే సినిమా ఫ్లాప్ కావడంతో చివరకు నవ్వుల పాలయ్యాడు. ఈ సంఘటన జరిగినప్పటినుండి విష్ణుతో నాని మాట్లాడడం మానేసాడట. ఇప్పటికీ వీళ్లి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.