సెల్ఫీతో చిచ్చుపెడుతున్న హీరోయిన్ మెహ్రీన్!

టాలీవుడ్ అందాల క్యూట్ లేడీ మెహ్రీన్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతోనే టాలీవుడ్లో పాగా వేసింది మెహ్రీన్. ఇక ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరంలేకుండా పోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా మెహ్రీన్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది. చివరగా ఎఫ్3 చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో మెప్పించింది. నటనతోపాటు మెహ్రీన్ స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.

ఇకపోతే F3 తర్వాత మాత్రం మెహ్రీన్ తెలుగు సినిమాలకు సైన్ చేసినట్టు కనబడటం లేదు. కాగా తమిళనుండి రెండు ఆఫర్లు, బాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చినట్టుంది. దాంతో వాటిపైనే అమ్మడు ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ అందమైన లొకేషన్లో తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అవును, ప్రస్తుతం ఈ పాలమీగడ అందం తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ జాలిగా గడుపుతోంది. టైట్ జీన్స్ షార్ట్, పింక్ టాప్ లో మెహ్రీన్ క్లోజప్ సెల్ఫీలు సోషల్ మీడియాలో యువతని ఊరిస్తున్నాయి. కెమెరాకు దగ్గరగా ఆమె అందాలు చూసిన కుర్రాళ్ళు కునుకుపట్టడంలేదు. మరికొన్ని పిక్స్ లో మెహ్రీన్ రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ తన ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేస్తోంది. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో తేలిపోతున్నారు. ఈ క్రమంలో ‘హానీ ఈజ్ ది బెస్ట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకాలస్యం, మీరు కూడా చూసి తరించండి.