ఆసక్తి రేపుతున్న ప్రియమణి DR-56 మూవీ ఫస్ట్ లుక్..!!

ఎవరే అతగాడు చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ ప్రియమణి. యమదొంగ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రియమని మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఈ మధ్యకాలంలో మంచి విజయాలను అందుకుంటోంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తూ ఉంది ప్రియమణి. మొదట ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించి మళ్లీ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ప్రియమణి.

Priyamani roped in for a crucial role in Thalaivi
ఇక ఆటు తర్వాత ఆహా ఓటీటి లో విడుదలైన భామ కలాపం మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలోనే ప్రియమణి తాజాగా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నది ప్రియమణి. ఆ చిత్రమే DR-56 అని టైటిల్ ని నిర్ణయించడం జరిగింది. అయితే కన్నడలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళ్ ,మలయాళం లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలోని ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు.

Priyamani Latest Movie Doctor 56 First Look Poster Released - Sakshi
ఇందులో ప్రియమణి బ్లాక్ అండ్ వైట్ సూట్ లో ఏదో సీరియస్ లుక్ లో కనిపిస్తూ ఉన్నది ప్రియమణి ఈ సినిమా పైన ఒక్కసారిగా మంచి హైప్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక భామ కలాపం తర్వాత లేడీ ఓరియంటెడ్ ఈ చిత్రం కావడంతో ఈసారి కూడా హిట్ కొట్టడం ఖాయమని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

https://twitter.com/VijaySethuOffl/status/1581968369892589568?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1581968369892589568%7Ctwgr%5E19e627ad8c71d2cced02f73031f3694fda7a53b5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Fpriyamani-latest-movie-d56-movie-first-look-released-au57-803715.html