ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ రేంజ్ లోకి తీసుకెళ్లిన ఘనత దక్కించుకున్నాడు.

బాలయ్య గత ఏడాది సీజన్ 1 పూర్తిచేసుకుని మంచి సక్సెస్ను అందుకొని ఇటీవల సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి ఎపిసోడ్ గెస్ట్లుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే వారి తనయుడు లోకేష్ వచ్చి ఎపిసోడ్ 1 ఘనంగా పూర్తి చేసుకుని దుమ్ము లేపే రెస్పాన్స్ అందుకుంది. రెండవ ఎపిసోడ్ గెస్ట్లుగా యంగ్ హీరోలైన విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డ వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ సేన్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు చిన్నవయసులోనే ఎక్కువ బాధ్యతలు తీసుకున్నాడని‌‌… ఈ వయసులోనే దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా చేయడం అంటే వయసుకు మించిన భారం మోస్తున్నాడని వారి తల్లి పేర్కొంది. దీనిపై విశ్వక్ సేన్ స్పందిస్తూ ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉండడానికి తనకు సమయం దొరకటం లేదని.. ఏదేమైనాప్పటికీ 2023 జనవరి నుంచి నెలలో పది రోజులైనా సరే ఇంటికి కేటాయిస్తానని వారి తల్లిదండ్రులకు మాటిచ్చాడు.

ఈ విషయం పై బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను కూడా తన భార్య వసుంధరకు ఎన్నో సార్లు మాటిచ్చానంటూ చెప్పుకొచ్చాడు. అలా ప్రతి ఆదివారం ఎటువంటి పని పెట్టుకోకుండా ఫ్యామిలీతో ఉంటానని కానీ కొన్ని కారణాల వల్ల ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాననీ వారి మనసులో మాట బయటకు వెల్లడించారు. ప్రస్తుతం తన భార్యకు ఎన్నోసార్లు మాటిచ్చిన నిలబెట్టుకోలేని బాలయ్య చెప్పిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.