సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధరగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది.
ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు ముందు సమంతాని కాకుండా కీర్తి సురేష్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఆ టైంలో కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో తో ఆ సినిమాకు నో చెప్పింది అట.
కీర్తి సురేష్ నో చెప్పడంతో తన కెరియర్ లోనే అతి పెద్ద తప్పు చేసింది.. రంగస్థలంలో కీర్తి సురేష్ నటించి ఉంటే తన ఇమేజ్ మరో లెవల్ కు వెళ్లేదని కొందరు అంటున్నారు. ఈ సినిమాలో నటించి ఉంటే ప్లాప్ సినిమాలను తప్పించుకొని సమంతల పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగేదని.. ఏదేమైనా కీర్తి సురేష్ కధల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. కీర్తి సురేష్ వరస సినిమాలు చేస్తున్న విజయాలు అందుకోలేక పోతుంది. మహేష్ బాబుతో నటించిన సర్కారి వారి పాట సినిమా ఓ మాదిరి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆమె నటించే సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు.