అది ఫెయిల్ కావడం వల్లే.. సమంత బయటకు రాలేదా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్,హాలీవుడ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది. తన కెరియర్ పై మొత్తం ఫోకస్ పెట్టి పలు అవకాశాలను అందుకుంటోంది సమంత.అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం సమంత సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉండడంతో పలు రకాల రూమర్స్ వచ్చాయి. ఇక సమంతకు చర్మ సంబంధిత వ్యాధి తో బాధపడుతోందని అందుచేతనే ఆమె ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లిందని వార్తలు కూడా వినిపించాయి. ఈ కారణంగానే కొద్ది రోజులుగా సమంత షూటింగ్లకు కూడా బ్రేక్ ఇచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నాయి.

Samantha Ruth Prabhu was asked to describe 2021 in a word; Find out what  she said | PINKVILLA
ఇక విడాకులు తర్వాత సమంత కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది యూఎస్ఏ లో చిన్నపాటి సర్జరీ చేయించుకుందని సమాచారం. చికిత్స అయిపోయిన వెంటనే అమెరికా నుండి వచ్చి ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకొని తన సినిమా షూటింగ్లో పాల్గొనబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత సర్జరీ ఫెయిల్ అయిందని అందుచేతనే ఈమె సోషల్ మీడియాలో కానీ, మరి ఎక్కడ కానీ కనిపించలేదని వార్త వైరల్ గా మారుతున్నాయి. దీంతో సమాంత అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ విషయం నిజమో కాదో అని చాలా సతమతమవుతున్నారు అభిమానులు.

South actress Samantha Ruth Prabhu reveals her last dream and tattoo|  entertainment News in Hindi | South actress सामंथा रुथ प्रभु ने अपने अंतिम  सपने व टैटू का किया खुलासा
ఇప్పుడిప్పుడే సమంత విడాకుల విషయం నుంచి బయటికి వస్తున్న సమయంలో పలు అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టడంతో ఆమె అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద , ఖుషి వంటి సినిమాలలో నటిస్తోంది. సమంత నటించిన ఈ సినిమాలు ఒక్కొక్కటి విడుదల కాబోతున్నాయి.