షాకింగ్ న్యూస్‌: టాలీవుడ్ న‌టిపై అత్యాచారం… !

టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటిపై ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతనిపై బాధితురాలు ముంబై నగరంలోకూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. ఫిట్నెస్ ట్రైనర్ ఆదిత్య కపూర్ అనే అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద అత్యాచారం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లి గురించి అడిగితే అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చేవాడు. పెళ్లి గురించి అడిగినప్పుడు అలా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ నాపై దాడి చేసేవాడ‌ని.. చివ‌ర‌కు పెళ్లి గురించి మాట్లాడితే నిను చంపేస్తాను అని బెదిరించేవాడు అని ఆరోపించింది.

హైదరాబాద్ లో దారుణం..ఆర్టీఏ ఉద్యోగినిపై హోంగార్డు లైంగిక దాడి..! | Manalokam

తాము ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలను, వీడియోలను తీసి వాటితో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం.. కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆదిత్య కపూర్ జిమ్ నిర్వహిస్తున్నాడు. చాలామంది హీరోయిన్లకు, మోడల్ లకు ఇతను ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నాడు. ఈ సందర్భంలోనే ఓ టాలీవుడ్ నటి కూడా అతని వద్ద ఫిట్నెస్ ట్రైనర్ గా చేరింది. ఈ క్రమంలోనేనే వీళ్ళిద్దరూ కొన్ని రోజుల్లోనే దగ్గరయ్యారు.

భాగ్యనగరం సిగ్గుపడేలా.. ఆ వీడియోలతో బెదిరిస్తూ.. మరో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌ | Five young men gang-raped a girl by threatening with those rape videos, another incident in ...

ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అంతలోనే ఆదిత్య కపూర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు. కొంతకాలం గడిచాక నన్నుపెళ్లి చేసుకోమని అడగగా అతను నిరాకరించాడు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. ఆదిత్య కపూర్ ఆ నటిని చాలా దారుణంగా తిడుతూ కొడుతూ దుర్భాషలాడేవాడు. అతను చేసిన పనులకు తట్టుకోలేక ఆ నటి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆదిత్య కపూర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.