ఒకే స్టయిల్ లో కృష్ణంరాజు, ప్రభాస్.. అదిరిపోయిన వీడియో..

టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు.. ఆయన నటన, కళ్లలో రద్రం, ఆయన పర్సనాలిటీతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ లుక్స్, నటన అచ్చం కృష్ణంరాజును పోలీ ఉంటాయి. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే..

ఈక్రమంలో ప్రభాస్ తన పెద్దనాన్న కృష్ణంరాజును స్మరించుకుంటూ ఓ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరిని మిక్స్ చేస్తూ వీడియోను ఎడిటింగ్ చేశారు. ఈ వీడియో ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూస్తే మాత్రం ప్రభాస్ ని యంగ్ రెబల్ స్టార్ అని ఎందుకు అంటారో తెలిసిపోతుంది..

ఆ వీడియోలో కృష్ణంరాజు నటించిన సినిమాల్లో పాత్రలు, ప్రభాస్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను ఒకదానితో ఒకటి మిక్స్ చేసి వీడియో ఎడిటింగ్ చేశారు. ఈ వీడియోలో చాలా వరకు ప్రభాస్ అచ్చం కృష్ణంరాజులా కనిపిస్తున్నారు. ఇక ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ఛత్రపతి, బాహుబలి సినిమాల్లోని మ్యూజిక్ ని జోడించారు.

ప్రభాస్ షేర్ చేసిన ఈ వీడియోకు ఎలాంటి క్యాప్షన్ పెట్టలేదు. కేవలం హార్ట్, నమస్కారం ఎమోజీలను మాత్రమే పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఎవరో ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. కానీ ప్రభాస్ తన పెద్దనాన్నను తలచుకుంటూ దీనిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. షేర్ చేసిన వెంటనే ఈ వీడియో వైరల్ అయ్యింది. అభిమానులు వేల కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రభాస్ ‘సలార్’ సినిమా కొత్త షెడ్యూల్ మళ్లీ ప్రారంభమైంది. ప్రశాత్ నీల్ ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. హూంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.