Godfather: సినిమాలో సల్మాన్ ఖాన్ ఇష్టం లేకుండానే నటించారా..?

గాడ్ ఫాదర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. మలయాళ రీమేక్ లూసీఫర్ ఆధారంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇందులో కీలకపాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు ఆమెకు భర్త పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మోహన్ రాజ దర్శకత్వం వహించగా రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్, ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. ఇకపోతే ఆచార్య సినిమా ఫ్లాప్ కారణంగా మెగా ఫ్యాన్స్ ముందు నుంచి గాడ్ ఫాదర్ విషయంలో ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.

Chiranjeevi and Salman Khan come together for 'Thaar Maar' in Godfather;  song to release on September 15 : Bollywood News - Bollywood Hungama

ఇకపోతే ఇటీవల చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై ఒక ప్రత్యేక పాటని షూట్ చేసి విడుదల చేయడం జరిగింది. ప్రభుదేవా పర్యవేక్షణలో స్పెషల్ సాంగ్ అనేసరికి ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఊహించుకున్నారు. లిరికల్ వీడియో కోసం చిత్ర బృందం ప్రకటించిన తర్వాత వారం రోజులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇకపోతే ఈ స్టార్ హీరోల డాన్స్ గురించి పక్కన పెడితే పాటకు కంపోజ్ చేసిన ప్రభుదేవా పై కూడా పూర్తిగా ట్రోలింగ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఊహించుకుంటే..ప్రభుదేవా ఊసురుమనిపించాడని ఫాన్స్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఇకపోతే చిరంజీవి తనదైన స్టెప్పులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే.. సల్మాన్ ఖాన్ మాత్రం అంటీ అంటనట్టుగా.. పట్టీ పట్టనట్టుగా.. సినిమాలో నటించడమే తనకు ఇష్టం లేదన్నట్టుగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్నేహం కోసమే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నాడని చిరంజీవి చెప్పినా..సల్మాన్ ఖాన్ ప్రవర్తనలో ఏమాత్రం అది కనిపించడం లేదు. ఇక బలవంతంగానే ఇష్టం లేకపోయినా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పాటలోనే ఇలా ఉంటే సినిమాలో ఏ విధంగా తన నటన ఉందో అంటూ కూడా నెటిజన్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.