`పుష్ప` సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక `పుష్పా` సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయి వారి నుంచి మంచి ఆదరణ అయితే పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో బన్నీకి నార్త్‌లో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం పలు కంపెనీలలో తమ బ్రాండ్లు ప్రమోట్ చేయడం కోసం అల్లు అర్జున్ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమాల పరంగా… యాడ్స్ పరంగా అల్లు అర్జున్ భారీగానే సంపాదిస్తున్నారని అనిపిస్తుంది. అల్లు అర్జున్ ఇప్పటికే హైదరాబాదులో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఖరీదైన ఆస్తులను కొన్నారు. ఇటీవల హైదరాబాదులో 100 కోట్ల రూపాయల నిర్మాణంలో ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసినదే.
హైదరాబాద్ అమీర్‌పేటలో పాత సత్యం థియేటర్ ప్లేసులో ఓ మల్టీఫ్లెక్స్ను ఆసియన్ వాళ్లతో కలిసి కడుతున్నారు. అదే విధంగా గండిపేట ఏరియాలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ ని నిర్మించారు. పది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టూడియోని అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్యగారి జయంతి సందర్భంగా భారీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు స్టూడియోస్ పరిసర ప్రాంతంలోనే అల్లు అర్జున్ మరొక ఖరీదైన ప్రాపర్టీ కొన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ప్రాపర్టీ కోసం అల్లు అర్జున్ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారంగా చెబుతారు అన్నట్లు సమాచారం.