బన్నీని అవమానించిన సత్యదేవ్… అంత మాట అనేశాడు ఎంట్రా బాబు..!?

`జ్యోతిలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సత్యదేవ్.. తనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో లక్షల జీతం అందుకుంటున్న సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదులుకుని ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాడు. సత్యదేవ్ ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్` సినిమాలో విలన్ రోల్ చేశాడు. `లూసిఫర్` సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబెరాయ్ పోషించిన రోల్ తెలుగులో సత్యదేవ్ నటించాడు.

చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్ సత్యదేవ్ కి ఇచ్చాడు అంటే మెగాస్టార్ చిరంజీవికి సత్యదేవ్ పై చాలా నమ్మకం ఉంద‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 5న దసరా సందర్భంగా `గాడ్ ఫాదర్` సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ మీడియాతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

సత్యదేవ్ ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటించాడని… ఇక ఇప్పుడు చిరంజీవి గారితో `ఆచార్య`, `గాడ్ ఫాదర్` సినిమాల్లో చేశానని చెప్పారు. అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ తో కూడా కలిసి సినిమాల్లో చేయాలని సత్యదేవ్ పేర్కొన్నాడు. ఇక ఆయన అల్లు అర్జున్ కంటే కూడా ముందుగా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని అది తన కోరికని చెప్పుకొచ్చాడు. ఇక ఆ మాట‌తో బన్నీని అవమానించినంత ప‌నైంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన నటన తనకు ఇన్స్పిరేషన్ అంటూ సత్యదేవ్ వెల్లడించాడు. ఇకపోతే ఎన్టీఆర్ నటిస్తున్న లేదా నటించబోతున్న సినిమాల్లో ఒక చిన్న రోల్ దక్కిన అది చేసేందుకు రెడీ అన్నట్లుగా సత్యదేవ్ చెప్పాడు. అయితే సత్యదేవ్ ఇలా వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూనే మరోవైపు మూడు నాలుగు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఇక ఆయన నటించిన `గుర్తుందా శీతాకాలం`, `కృష్ణమ్మ` సినిమాలు అతి త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతున్నాయి.