తారక్ కోసం చక్కనైన కుందనపు బొమ్మ ని సెలక్ట్ చేసిన ప్రణతి..అభిమానులు పిచ్చ హ్యాపీ..!?

`త్రిబుల్ ఆర్` సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది.

ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ గా మారాయి. మొదట్లో టాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుందన్న వార్త వచ్చిందిజ. కానీ అలియాభట్ తల్లి కాబోతున్న కారణంగా ఈ సినిమాని చేయలేకపోయింది అట. ఇక తర్వాత రష్మిక మందన,దీపికా ప‌దుకునేతో పాటు మ‌రి కొన్ని పేర్లు కూడా వినిపించాయి. ఇటీవల ఈ సినిమాలో ఎన్టీఆర్ సరస‌న‌ మహానటి కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసారన్న వార్త‌లు వ‌స్తున్నాయి.

తారక్ కు జోడిగా కథకు కీర్తి అయితే బాగా సెట్ అవుతుంద‌ని అందుకే కొరటాల శివ ఆమెపై మొగ్గు చూపారని టాక్ నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ నటించడానికి ప్రణతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో నటిస్తాడు? సినిమా స్టోరీ ఎలా ఉంటుంది? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక కొరటాల శివ మాత్రం కీర్తి సురేష్ ను కన్ఫామ్ చేశారని టాక్ అయితే గ‌ట్టిగా వ‌చ్చేసింది.