పెళ్లికి సిద్ధమైన సురేఖవాణి.. వరుడు ఎవరో చెప్పిన సుప్రీత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి తన కూతురు సుప్రితాతో కలిసి చేసే రచ్చ ఎంతలా ఉంటుందంటే చూసిన వాళ్ళు కొంతమంది తల్లి కూతుర్లు అంటే ఇలాగే ఉండాలని అంటే.. మరి కొంతమంది ఛీ ఛీ ఇదేమీ విచ్చలవిడిగా తిరగడం అంటూ కోప్పడే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరిని పొగిడే వాళ్ళు కొంతమంది అయితే తిట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఎవరు ఏమనుకున్నా సరే మేం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగానే వీరిద్దరూ బిహేవ్ చేస్తూ ఉంటారు.Surekha Vani Getting Proposals from Rich Uncles!

పబ్బులు, పార్టీలు, విహారయాత్రలు ఇలా ఒక్కటేమిటి..ఇలా చెప్పుకుంటూ పోతే వీరు కలిసి ఎంజాయ్ చేసినట్టు మరెవరు చేయరేమో అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ తల్లి కూతుర్లు ఇద్దరూ ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగానే తల్లి కూతుర్లు ఇద్దరికీ ఎస్ ఆర్ నో బోర్డు తగిలించి రకరకాల ప్రశ్నలు అడిగాడు నిఖిల్. ఇక అందులో బాగానే మీరిద్దరూ సింగిలా.. బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడగ్గా ఇద్దరూ నో అని అనేశారు. అక్కడితో ఆగితే వీళ్ళిద్దరూ హాట్ టాపిక్ ఎందుకు అవుతారు..కానీ కూతురేమో నాకు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి అని అన్నది.. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి అని కూతురు పాట అందుకుంటే.. తల్లి కూడా నాకు కావాలి అంటూ అదే పాటను అందుకుంది.Actress Surekha Vani turns 40, daughter throws special party - pics and  video go viral - Tamil News - IndiaGlitz.com

ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి సురేఖ అంటే పెద్ద లిస్ట్ చెప్పింది సురేఖ వాణి . నన్ను మంచిగా అర్థం చేసుకోవాలి.. మంచి హైట్ ఉండాలి. మంచి వ్యక్తి అయి ఉండాలి.. లైట్ గా గడ్డం ఉండాలి.. బాగా డబ్బులు ఉండాలి అంటూ ఒక పెద్ద చిట్టా చెప్పుకొచ్చింది సురేఖ వాణి. అయితే పక్కనున్న సుప్రీత తెగ సిగ్గుపడుతూ కెమెరా వైపు చూస్తూ.. మీకు ఇవేమీ లేవు కదా సార్.. అని మ్యాటర్ లీక్ చేస్తూ తల్లి సురేఖవానికి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్పేసింది. దీన్నిబట్టి చూస్తే ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అర్థమవుతుంది. పేరు చెప్పడానికి మాత్రం వీరిద్దరూ ఇష్టపడలేదు.