మోహన్ బాబు – అమీర్ ఖాన్ మధ్య అనుబంధం ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా అమీర్ ఖాన్ పేరు సంపాదించుకున్నారు. ఇక ఇద్దరూ కూడా ప్రాంతీయ భాషలలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే మోహన్ బాబు విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి నాయకుడిగా, కమిడియన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ రంగ పరంగా దూసుకుపోతుండడంతో పాటు మరొకవైపు విద్యాసంస్థల అధినేతగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు

Aamir Khan regrets not spending enough time with kids Ira Khan, Junaid Khan  | Bollywood - Hindustan Timesఇక అమీర్ ఖాన్ కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ముందుంటారు అని చెప్పవచ్చు. నిజానికి విభిన్న దృవాలైన వీళ్లిద్దరి మధ్య ఒక చిన్న అనుబంధం కూడా ఉంది.. ఇకపోతే వీరి ఇద్దరికీ ఉన్న అనుబంధం ఏమిటి అంటే .. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన అందాజ్ అప్నా అప్నా.. సినిమాను అప్పట్లో తెలుగులో కొద్దిగా మార్పు చేసి మోహన్ బాబు , బ్రహ్మానందం లతో వీడెవడండీ బాబు సినిమాగా ఈవివి సత్యనారాయణ రీమేక్ చేసి తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ టాక్ తో నిలిచింది.. దాదాపు 20 సంవత్సరాల క్రితం రాజకుమార్ సంతోషి దర్శకత్వంలో అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన అందాజ్ అప్నా అప్నా సినిమా బాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది ఇక ఇందులో హీరోయిన్ కరిష్మా కపూర్, రవీనా టాండన్ లు నటించారు.Mohan Babu: 2010 cheque bounce case: Mohan Babu sentenced to 1-year  imprisonment, asked to pay Rs 41.75 lakh fine

తాజాగా ఈ సినిమాను నాగార్జున, చిరంజీవి రీమేక్ చేయాలనుకుంటున్నట్లు లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పడం విశేషం. ఇకపోతే అదే సినిమాను మోహన్ బాబు రీమేక్ చేసి ఒక మోస్తారు విజయాన్ని సొంతం చేసుకుంటే ఇప్పుడు అదే సినిమాను నాగార్జున , చిరంజీవి తెరకెక్కించబోతున్నట్లు తెలిపారు. మరి వీరిలో ఎవరు అత్యధిక విజయాన్ని సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే అమీర్ ఖాన్ నటించిన సినిమాను మోహన్ బాబు తెరకెక్కించడంతో అక్కడ వీరిద్దరికి మంచి స్నేహబంధం ఏర్పడిందని అంతా చెబుతూ ఉంటారు.