సర్వే: ‘ఫ్యాన్’ స్పీడ్ తగ్గుతుంది..!

అవును ఏపీలో వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది…గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలవడమే కాకుండా…పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఉపఎన్నికలు…ఇలా ఎన్నికలైన సత్తా చాటిన వైసీపీ..ఇప్పుడు వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విషయం తాజాగా వెలువడుతున్న సర్వేల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆ మధ్య వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలింది…కానీ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బలం తగ్గిందని రుజువైంది.

అయితే ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా అదే స్పష్టమవుతుంది…ఇక తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట వచ్చిన సర్వేలో…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…వైసీపీనే అధికారంలోకి వస్తుందని తేలింది. వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి 22, టీడీపీకి 3 ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు వైసీపీ బలం కాస్త తగ్గుతున్నట్లే కనిపిస్తోంది…వైసీపీకి 4 ఎంపీ సీట్లు తగ్గగా, టీడీపీకి 4 ఎంపీ సీట్లు పెరుగుతున్నాయి.

సరే సీట్లు తగ్గిన సరే వైసీపీనే లీడ్ లో ఉంది…వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే వచ్చే ఫలితాలు ఇవి. కానీ ఎన్నికలు జరిగే సమయానికి ఫలితాలు ఎలా వస్తాయనేది చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్తితిని బట్టి చూస్తే…వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తుందని అర్ధమవుతుంది. ఎన్నికల నాటికి ఇంకా బలం తగ్గితే పరిస్తితి మారిపోతుంది.

పైగా సర్వే వచ్చింది టీడీపీ-జనసేన పొత్తు కాంబినేషన్ పై కాదు. అంటే రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలని చూసి వైసీపీ మురిసిపోకూడదు….ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉంది. తమ బలం తగ్గుతుందని వైసీపీ శ్రేణులు గ్రహించాల్సి ఉంది. కాబట్టి  ఇక నుంచి బలం తగ్గకుండా, పెంచుకోవాల్సిన అవసరం ఉంది.