తెలుగులో నంబర్ వన్ హీరో అతడే.. సందడి చేస్తున్న అభిమానులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూనే ఉంటారు. ఇక ఈ సర్వేల ద్వారా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయం కూడా వెల్లడిస్తూ ఉంటారు . ఇక తాజాగా ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సర్వే నిర్వహించి.. ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందని విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూలై 2022 తెలుగు కు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇక ఈ సర్వే ఫలితాల ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి స్థానంలో ఉన్నారు. ఇక తెలుగులో నంబర్ వన్ హీరో ఎన్టీఆర్ అని చెప్పడంతో ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యంతో పాటు హార్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎట్టకేలకు మా హీరో నెంబర్ వన్ అంటూ ఈ విషయాన్ని వైరల్ చేస్తూ ఉండడం.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంతోపాటు ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ కావచ్చు అనే చర్చ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో జూలై నెల ఫలితాలలో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకోవడంతో ఫాన్స్ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఉన్నారు. క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. అంతేకాదు ఈయన సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని చెప్పవచ్చు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచారు.. పుష్పా సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా దగ్గర అవడంతో పాటు సీక్వెల్ కోసం అక్కడ కూడా ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇక ఐదవ స్థానంలో మహేష్ బాబు , ఆరవ స్థానంలో నాని, ఏడవ స్థానంలో పవన్ కళ్యాణ్, ఎనిమిదవ స్థానంలో విజయ్ దేవరకొండ , 9వ స్థానంలో చిరంజీవి, పదవ స్థానంలో రవితేజ నిలిచారు.

Share post:

Latest