ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు చేరింది.
వాస్తవానికి .. కేంద్రంలోని కీలక బీజేపీ నాయకులు కూడా అవకాశం వచ్చినప్పుడు తమకు సాయం చేయాలని.. ఇటీవల డిల్లీ పర్యటనలో సీఎం జగన్ను కూడా కోరినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ సాయం ఏంటనేది.. వారు చెప్పడం లేదు. అలాగని.. ఏం చేయాలో వైసీపీకి కూడాపాలు పోవడం లేదు. “మేం ఏపీకి ఎంతో చేస్తున్నాం. మేం సానుకూలంగా ఉన్నారు కాబట్టే.. ఏపీలో ప్రభుత్వం సజావుగా ఉంది.“ అని బీజేపీ నేతలు ఢిల్లీలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది వాస్తవమే. ఎందుకంటే.. ఎన్నో బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రంలోని ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రయోగిస్తోంది.
ఆపరిస్థితి గడిచిన మూడేళ్లో బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నప్పటికీ..ఏపీలో కనిపించలేదు. దీనికి కేంద్రానికి-ఏపీకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాలే కారణంగా కనిపిస్తున్నాయనేది వాస్తవం. ఈ క్రమంలో బీజేపీ మేం .. మీకు సహకరిస్తున్నాం.. కాబట్టి మాకేంటి? అని ప్రశ్నిస్తున్నట్టు తాజాగా వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణపై బీజేపీ కన్ను పడింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే.. ఇక్కడ పరిస్థితి కొంత సానుకూలంగా మరింత వ్యతిరేకంగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న పార్టీని తెలంగానలో తమకు సాయం చేయాలని కోరే ఉద్దేశంతోనే ఇలా.. మాకేంటి? అని ప్రశ్నిస్తున్నట్టు మేధావులు సందేహిస్తున్నారు. తెలంగాణలో రెడ్డి వర్గం.. అదేవిధంగా బోర్డర్ జిల్లాల్లో వైసీపీకి పట్టుంది. అదేసమయంలో కొందరు పెట్టుబడిదారుల్లోనూ.. వైసీపీకి మద్దతు పలికేవారు ఉన్నారు.
మాజీ ప్రజాప్రతినిధులు.. గతంలో వైసీపీలో ఉన్నవారు కూడా అనేక మంది తెలంగాణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి మద్దతును కూడగట్టేలా.. వైసీపీని ముందుండి నడిపించాలనే వ్యూహం ఏదో బీజేపీ పెద్దల మదిలో ఉందనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇప్పుడు దీనిపైనే వైసీపీ తర్జన భర్జన పడుతుండడం గమనార్హం. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.