తమన్నాకు కోట్లు విలువ చేసే వజ్రాని గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో భార్య.. ఎంత స్పెషలంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. ఇన్నాళ్ల సినీ ఇండస్ట్రీలో అన్ని భాషల కు సంబంధించిన హీరోయిన్లు తమ లక్ కు టాలీవుడ్ పరిక్షించుకున్నారు. కానీ, వాళ్ళల్లో కొందరే సక్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది..ఈ పాల మిగడ లాంటి అందం ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా..పేరు అందరికి తెలిసేలా చేసింది..శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్షన్ లో వచ్చిన “హ్యాపీ డేస్” సినిమా లో మధు క్యారెక్టర్ లో కుర్రాళ్ళ మనసు దోచ్చింది.

అంతే ఇక అప్పటి నుండి..ఇప్పటి వరకు..అంటే సుమారు 17 ఏళ్లు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్ధితిరాలేదు. ఫ్లాప్ సినిమాలు పడినా..మళ్ళీ స్టార్ హీరోల సినిమాలతో అద్దిరిపోయే పర్ ఫామెన్స్ లతో ..కుర్ర బ్యూటీల అందాలకు కూడా చెక్ పెడుతూ..హాట్ ఎక్స్ పోజింగ్స్ తో తన స్దానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. ప్రజెంట్ తమన్నా చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయంటేనే ..ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

అయితే, రీసెంట్ ఆమె దగ్గరున్న వజ్రం విషయం బయటపడింది. ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..ఆ వజ్రం చాలా స్పెషల్ అని..అది ప్రపంచంలేనే 5వ అతిపెద్ద వజ్రం అని తెలుస్తుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే..ఆ వజ్రాని తమన్నా కు ఇచ్చింది..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వజ్రం ఖరీదు సుమారు రూ. 2 కోట్లు పైనే ఉంటుందట. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్‌ అవుతోంది.