అమ్మో.. బ్రహ్మానందం ఆస్తి విలువ అన్ని వందల కోట్లా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ.. కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఒకానొక సమయంలో బ్రహ్మానందం లేని చిత్రాలు అంతగా ప్రేక్షకులు చూసేవారు కాదు అనే అంతలా ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఈయన కాల్ షీట్ల కోసం ఎదురుచూసేవారు. ఇక ఈయన డేట్స్ ఖాళీగా లేక పలు సినిమాలు వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.Brahmanandam undergoes heart surgery | Entertainment News,The Indian Express

సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బ్రహ్మానందం తన కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అతి తక్కువ సమయంలోనే 1000 కి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డు సాధించారు. అయితే ఇప్పటికీ బ్రహ్మానందం దాదాపుగా ఎన్నో సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఆరోగ్యం బాగాలేక ఉండడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన సినిమాలలో నటిస్తే చూడాలని ఇప్పుడు ఎంతమంది ఎదురుచూస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్యరీత్యా కొంతవరకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ అవసరం అనుకుంటే తప్ప అటువైపు చూడడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈయనకు ఇంత డిమాండ్ ఉంది కాబట్టే ఒక రోజు షూటింగ్లో పాల్గొంటే ఈయనకు సుమారుగా రూ.4 లక్షలకు పైగా పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.Brahmanandam (Comedian) Age, Wife, Family, Biography & More » StarsUnfolded

ఇక ఒక రోజుకు అంత పారితోషకం తీసుకునే బ్రహ్మానందం తన సినీ కెరియర్లో ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించారు? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మరీ బ్రహ్మానందం ఆస్తి విలువ ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తను సంపాదించిన వాటిలో కొంత పెట్టుబడిని రియల్ ఎస్టేట్ పైన, పలు ప్రాంతాలలో భూములు , ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది. దాంతో దాదాపుగా ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్తి విలువ సుమారుగా రూ.650 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో కూడా తనలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకువచ్చారు బ్రహ్మానందం. ఇక పలు రకాల బొమ్మలు వేసి వాటిని టాలీవుడ్ లోని కొంతమంది స్టార్ హీరోలకు బహుమతిగా ఇచ్చారు.