నిహారిక కొణిదెలకు వయసై పోయిందంటున్న ట్రోలర్స్… ఇదే కారణం!

నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని ఫిగరు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక అమ్మాయిగా ఎదుర్కొనవలసిన ఛీత్కారాలు అన్నీ ఎదుర్కొని తెలుగు సినిమా పరిశ్రమలో త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు, సినిమాలు ఆడకపోవచ్చు. కానీ తనకంటూ ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హోమ్లీ రోల్స్ చేస్తూ కుటుంబ ఆడియన్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె చేసిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఆమెకి ఒకింత పేరుని తీసుకువచ్చాయి. ఆమె చేసిన సినిమాలకుగాను నటిగా మంచి గుర్తింపు సంపాదించింది.

అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల ప‌లు వివాదాల‌తో కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంది. హైద‌రాబాద్ ప‌బ్‌లో జ‌రిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయ‌డం.. అక్క‌డ నిహారిక దొర‌క‌డం నుండి ఈ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఈ విష‌యంలో ఆమె సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న సోష‌ల్ మీడియాకి కొంత గ్యాప్ ఇచ్చిన నిహారిక‌ 8 వారాల లాంగ్ బ్రేక్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తెగ ర‌చ్చ చేస్తుంది. తాజాగా నిహారిక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్ షేర్ చేయగా, దీనిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.

తాజాగా ఆమె తలకిందకు దించుతూ, నవ్వుతున్న ఓ ఫోటోను నిహారిక షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మొఖం చూపించుకునే ధైర్యం లేదు. ఏ పిక్ కూడా తల పైకెత్తి చూసింది లేదు’ అంటూ నిహారిక ఫోటోకు కౌంటర్ పెట్టాడు. మరో నెటిజన్ ‘ముగిసన మన కథని మళ్లీ కొత్తగా ప్రాణం తీస్తున్నావా? ప్రాణం పోస్తున్నావా? అంటూ కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ ముసలావిడలా కనిపిస్తున్నావు? అంటూ కామెంట్ చేశాడు. ఇలా నెటిజన్స్ రకరకాలుగా నిహారిక పెట్టిన పోస్టుపై స్పందిస్తున్నారు. పబ్ ఘటనతో కొందరు సోషల్ మీడియాలో ఇప్పటికీ నెగెటివ్ కామెంట్లు చేస్తూ ఉండటం బాధాకరం.