రోజా ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే షాక్..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది అలనాటి హీరోయిన్ రోజా. ప్రస్తుతం రాజకీయాలలో కూడా తనదైన శైలిలో హవా కొనసాగిస్తూ ఉన్నది. ఇక ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. ఈమె చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించింది. ఇక ఈమె తండ్రి నాగరాజు రెడ్డి ,లలిత తల్లి.. అయితే రోజా తండ్రి సినిమా డిపార్ట్మెంట్లో పనిచేయడంతో వీరంతా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక తన తండ్రి సహకారంతోనే రోజా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రోజా తల్లి కూడా ఒక నర్సుగా పనిచేసే కాలేజ్ ప్రిన్సిపల్ గా ఎదిగింది.Actress Roja undergoes two major surgeries | Telugu Movie News - Times of India

రోజా నటించిన మొదటి సినిమా “ప్రేమ తప్పసు”ఈ సినిమాని మాజీ ఎంపీ శివప్రసాద్ డైరెక్షన్ చేశారు. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన హీరోయిన్గా రోజా నటించింది. ఆ తరువాత పలు అవకాశాలు ఈమె దగ్గరకు రాలేదు కానీ పరుచూరి బ్రదర్స్, సురేష్ ప్రొడక్షన్లో శోభన్ బాబు హీరోగా సర్పయాగం అనే సినిమాలో శోభన్ బాబు కూతురు పాత్రలో రోజా నటించడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ తో రోజా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక తర్వాత చిరంజీవితో ముఠామేస్త్రి, బాలయ్యతో భైరవద్వీపం తదితర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది.Have You Seen Actress-Politician Roja's Grown-up Children? | Astro Ulagam

ఇక తమిళంలో తన భర్త సెల్వమని డైరెక్షన్లో వచ్చిన చెంబురుతి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో ఆమెను పరిచయం చేసిన డైరెక్టర్ నే రోజా వివాహం చేసుకోవడం విశేషం. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కుమార్తె ఉన్నది వీరిద్దరూ విదేశాలలో చదువుతున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా రోజా కూడా బాగానే ఆస్తులు సంపాదించినట్లుగా. ఈమె దగ్గర 4 ఖరీదైన కార్లు ఉన్నాయి వాటి విలువ 10 కోట్లు ఉంటుంది. రోజా పేరు మీద రూ.7.64 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. తన కూతురు కొడుకు మీద రూ.50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లుగా సమాచారం. తన భర్త సెలవమనిపై ఎలాంటి ఆస్తులు లేవు కేవలం 58 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. జబర్దస్త్ లో ప్రతినెల కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటుంది రోజా. అయితే ఇదంతా కేవలం అఫిడవిట్ల తెలిపినట్లుగా తెలుస్తోంది కానీ.. రోజా ఆస్తి విలువ మాత్రం రూ.80 కోట్లు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.