బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ అని చెప్పొచ్చు…అలాగే టీడీపీ, జనసేనలు మళ్ళీ నష్టపోతాయి.

ఇంకా చెప్పాలంటే పొత్తు లేకపోవడం వల్ల జనసేన కంటే టీడీపీకే ఎక్కువ మైనస్…ఎందుకంటే నెక్స్ట్ అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్ అంధకారమే. అందుకే టీడీపీకే పొత్తు ముఖ్యం. అలాగే టీడీపీలో పలువురు నేతలు గెలవాలంటే పవన్ సపోర్ట్ తప్పనిసరి అని చెప్పొచ్చు. ఇదే క్రమంలో బాలయ్య చిన్నల్లుడు భరత్ గెలవాలంటే పవన్ అవసరం ఎంతైనా ఉంది…వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్లే బాలయ్య చిన్నల్లుడుకు ఓటమి ఎదురైంది.

విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్…వైసీపీపై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. దాదాపు గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టారు. అయితే విశాఖ పార్లమెంట్ లో జనసేనకు దాదాపు రెండు లక్షల 88 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఏ స్థాయిలో ఓట్లు చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు..అదే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అప్పుడే బాలయ్య చిన్నల్లుడు గెలిచేవారు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలన్న కూడా పవన్ సపోర్ట్ ఉండాల్సిందే…ఎందుకంటే వైసీపీ బలం తగ్గుతూ వస్తున్న సరే…జనసేన బలం పెరుగుతుంది…అలాంటప్పుడు టీడీపీ ఎంత పుంజుకున్న పవన్ సపోర్ట్ కావాల్సిందే. లేదంటే భరత్ కు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. అదే టీడీపీ-జనసేన కలిస్తే బాలయ్య చిన్నల్లుడు డౌట్ లేకుండా గెలుస్తారని చెప్పొచ్చు.