రామారావు ఆన్ డ్యూటీ నుంచి మాస్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా దర్శకుడిగా పరిచయం కాబోతున్న శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఇక ఈ సినిమాలో మజిలీ హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ తో పాటు జై భీమ్ హీరోయిన్ రజీషా కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరో మాస్ అప్డేట్ విడుదలైనట్లు సమాచారం . తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుంచి రవితేజకు సంబంధించిన మాస్ యాక్షన్ సన్నివేశాలను ఒక టీజర్ రూపంలో విడుదల చేయడం జరిగింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మాస్ మహారాజా మరోసారి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం పక్కా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూలై 29వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాని కూడా రవితేజ పై ప్రశంశల వర్షం కురిపించడం గమనార్హం. స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ మాస్ హీరోగా రవితేజ గుర్తింపు తెచ్చుకున్నారు అంటూ .. ఇక ఈయన ఈ జనరేషన్ వారికి ఒక రోల్ మోడల్ అని నాని రవితేజ పై ప్రశంసల వర్షం కురిపించాడు

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరికొన్ని సన్నివేశాలను టీజర్ ల రూపంలో అప్డేట్ ఇస్తూ ఉండడం పై అభిమానులలో ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తాజాగా విడుదలైన మాస్ అప్డేట్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానున్నట్లు సమాచారం.