చత్రపతి సినిమా చైల్డ్ యాక్టర్.. మనోజ్ కష్టాలు తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఎంతోమంది బాల నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. వారిలో కొంతమంది హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు మరి కొంతమంది ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అలా బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మనోజ్ నంద కూడా ఒకరు. చత్రపతి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించి బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది మనోజ్ కి.చైల్డ్ యాక్టర్ గా తనకు తిరుగులేదని నిరూపించుకున్న మనోజ్ హీరోగా మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాబట్టుకోలేకపోయాడు. దీంతో కొన్ని అడపా దడపా సినిమాలు నటిస్తూనే మరొకవైపు కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తున్నారు. తాజాగా తమిళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం అనే చిత్రంలో ఆర్మీ మాన్ గా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తన జీవితంలోకి జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు.మనోజ్ తల్లి 2015 వ సంవత్సరంలో అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తెలిపారు. ఇక 2012వ సంవత్సరంలో తన తల్లికి క్యాన్సర్ అనే విషయం తెలిసిందంట డబ్బులు చాలా అవసరమని ఆ సమయంలో తన దగ్గరికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా సినిమాలు చేశాడట.. దాంతో తన తల్లిని బతికించుకోవాలని చాలా ఆశ పడ్డానని తెలిపారు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా అవి కూడా నష్టాలు వచ్చాయి దీంతో కుటుంబం చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయిందట. అందుచేతనే తన దగ్గరకు వచ్చిన ఏ అవకాశాన్ని వద్దనుకుండా డబ్బు కావాలని ఉద్దేశంతోనే అన్ని పాత్రలను ఒప్పుకున్నానని కానీ ఎంత ఖర్చుపెట్టిన తన తల్లి దక్కలేదని బాధ ఉందని తెలియజేశారు మనోజ్.